2024 ఎన్నికల్లో 175/175 గెలవడమే లక్ష్యం..ప్రతీ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుంటాను..ఈ క్రమంలో ఎల్లోమీడియా చేసే అసత్యప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టాలి.. ఏ ఒక్కరినీ ఒదులుకోను అంటూ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నియోజకవ ర్గాల ఇన్చార్జిలకు దిశానిర్ధేశం చేయడం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అంటే మీడియా కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే లే దనే విషయాన్ని ఇండరైక్టుగా చెబుతూనే, వైఎస్సార్సీపీ మొత్తమంతా సోషల్ మీడియానే నమ్ముకోవాలన్నట్టు చెప్పడం ఇపుడు పరిశీలకుల ను సైతం ఆలోచనలో పడేలా చేసింది. అయితే గతంలో ఇదే స్ట్రాటజీ అమలు చేసిన టిడిపి ప్రభుత్వం ఇదే సోషల్ మీడియా ద్వారానే ప్రజ ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఇపుడు వైఎస్సార్సీపీ కూడా అదే సోషల్ మీడియానే నమ్ముకొని ముందుకి వె ళితే పరిస్థితులు, ఫలితాలు మరోలా ఉండే అవకాశం కూడా ఉందని పరిశీలకులు ప్రకటించేయడం ఇపుడు హాట్ టాపిక్..!