స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పితూరి సేనాధిపతి గాం గంటం దొర 99 వ వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో ఉన్న గంటం దొర పవిత్రమైన ఆయన సమాధి వద్ద నివాళులర్పించడానికి గిరిజనులు తరలి రావాలని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు పిలుపు నిచ్చారు. ఈ మేరకు క్రిష్ణదేవిపేటలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజను లందరూ తలోక చోట కార్యక్రమాన్ని నిర్వహించడం కాకుండా గిరిజనులందరూ పవిత్రమైన గంటం దొర సమాధి వద్దే జరపాలని ఆ విధంగా గిరిజనుల ఐక్యతను చాటాలని పడాల విజ్ఞప్తిచేశారు. అలాగే గిరిజనేతరులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు గంటం దొర 99 వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని ఆయన కోరారు. ఆ రోజు జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గంటం దొర సమాధి వద్ద కార్యక్రమం నిర్వహించి ఆయ నకు ఘన నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు అల్లూరి యువజన సంఘానికి సంబంధించిన పలువురు ప్రముఖులు పాల్గొంటారని పడాల వీరభద్రరావు తెలిపారు.