అనకాపల్లి మార్కెట్ యార్డు పరిధిలోని పలు అభివ్రుద్ధి పనులకు పలు తీర్మాణాలు ఆమోదించి పరిపాలన అనుమతుల కోసం పంపనట్టు పలకా యశోద రవి పేర్కొన్నా రు. అనకాపల్లిలో బుధవారం మార్కెట్ కమిటీలో సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమోదించిన తీర్మానాలను కమిటీ సభ్యులు వివరించారు. మార్కెట్ యార్డ్ తూర్పు భాగంలో కాంపౌండ్ వాల్ మెయింటెనెన్స్ కోసం రూ.10 లక్షల బడ్జెట్ మంజూరు కోసం వ్యవసాయ కమిషనర్ కు పంపామన్నారు. అనకాపల్లి, కశింకోట మం డలాల్లో గ్రామాల్లో అవసరం మేరకు మెటల్ రోడ్లకి రూ.2 లక్షల వంతున 20 గ్రామాల్లో గ్రావెల్ రోడ్లు వేయడానికి అంచనాల బడ్జెట్ మంజూరు కోసం కూడా తీర్మానం చేశా మన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి డి.శకుంతల, కమిటీ ఉపాధ్యక్షులు కరక సోమినాయుడు, మెంబర్లు నీటిపల్లి లక్ష్మి, మరిపల్లిశోభ, బొబ్బిలి శ్యామ ల, ఈగల నూకరత్నం, దాడి తులసి కుమారి, బొడ్డు అచ్చిరాజు, పిట్ట అప్పలరాజు, తెరపల్లి నాగ సంతోష్ కుమార్, దాడి కృష్ణ, ఒమ్మి మధుబాబు, కొణతాల విజయ్ కుమారి, గుండా రమేష్ గుప్తా, గొంతిన శివ, ఏడి అగ్రికల్చర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.