12 న ఆంధ్రా శబరిమల 12 వ వార్షికోత్సవం


Ens Balu
34
Sankhavaram
2023-06-07 15:40:32

శంఖవరం మండలం పెదమల్లాపురం పంచాయతీ శివారు సిద్దివారిపాలెం గిరిజన గ్రామంలో వెలసిన ఆంధ్రా శబరిమల దేవస్థానం 12వ వార్షికోత్సవాన్ని ఈనెల 12న నిర్వ హించ నున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, గురుస్వామి, శంఖవరం గడ్డ ఆర్యవైశ్యవంశ ముద్దుబిడ్డ కుసుమంచి శ్రీసత్య శ్రీనివాసరావు నేతృత్వంలో వార్షికోత్సవ వేడు కలను అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తజన వైభవోపేతంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం స్వామి సన్నిధిలో వేకువజామున 5 గంటల నుండి హెూమాలు, యజ్ఞాలు, క్రతువులను వేద పండితులు నిర్వహిస్తారు. 7 గంటలకు ఉషోదయ పూజ అనంతరం 9 గంటలకు స్వామికి ప్రత్యేకాభిషేకాలను నిర్వహిస్తారు. 11 గంటలకు స్వామిని 18 మెట్ల మీదుగా ఊరేగిస్తారు. ఆలయ ఆవరణలోని కోనేరులో 11.15 గంటలకు స్వామికి చక్రస్నానం, 11.30 గంటలకు  స్వామి వారికి వెండి బిం దెలతో గంగోత్రి స్నానం నిర్వహిస్తారు. 12గంటలకు నవ కలశాభిషేకం గావించి, 12.30 గంటలకు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం 1 గంటకు ఆలయ ఆవరణలో భక్తజన సందోహానికి మహా అన్నదాన చేస్తారు. స్వామి ఆశీర్వచనం అందించడంతో నాటి ఆలయ వార్షికోత్సవ వేడుకలు పూర్తవుతాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుసుమంచి శ్రీసత్య శ్రీనివాసరావు గురుస్వామి మీడియాకు వెల్లడించారు.
సిఫార్సు