బొబ్బిలి ఎంపీడిఓగా పి.రవికుమార్ నియామకం


Ens Balu
11
Bobbili
2023-06-08 07:26:09

విజయనగరం జిల్లా బొబ్బిలి మండల పరిషత్ డెవలెప్ మెంట్ అధికారిగా పి.రవికుమార్ నియమితులయ్యారు. ఈయన అనకాపల్లి జిల్లా మునగపాక ఎంపీడీఓ కార్యాల యంలో అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించేవారు. పదోన్నతిపై బొబ్బలి ఎంపిడీఓగా వచ్చారు. ఈరోజు ఆయన విధుల్లోకి చేరనున్నారు. రవికుమార్ విధినిర్వహణలో ముక్కుసూటి అధికారిగా అనకాపల్లి జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే విషయంలో చురుగ్గా వ్యవహరిస్తారనే మంచిపేరు ఈయనకు ఉంది.
సిఫార్సు