క్రైమ్ రేట్ తగ్గించేందుకు తనవంతు కృషి చేస్తానని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై వి.వెంకటేశ్వర రావు తెలిపారు. డీసీఆర్బి లో విధులు నిర్వహిస్తూ వన్ టౌన్ ఎస్సైగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతూ ఉంటుందని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అక్రమ నియంత్రణకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్న కేసులు పరిశీలించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రజలతో మమేకమై, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పారు.