ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించే కార్యక్రమాలకు తొలి ప్రాధాన్యత ఇస్తానని బొబ్బిలి ఎంపీ డిఓ పి.రవికుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వ లక్ష్యం మేరకు చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చెప్పారు. త్వరలోనే మండంలోని అన్ని గ్రామ పంచాయతీలు, సచివా లయాలను సందర్శిస్తానని చెప్పారు. గ్రామాల్లో మౌళిక సదుపాయాలు, మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మండలంలోని గ్రామాలు, సచివా లయాల పరిధిలోని సమస్యలు తన ద్రుష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు క్రుషి చేస్తానని అన్నారు. ప్రజలు గ్రామ సచివాలయాల ద్వారా జగనన్నకు చెబుదాం కార్యక్ర మంతో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు సచివాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా ఎంపీడీఓని కలిసి పరిచియం చేసుకున్నారు.