అనకాపల్లి రైల్వే స్టేషన్ స్టేషన్‌లో రూఫ్ ప్లాజాలు, సిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అన్ని వర్గాల వినియోగదారుల సూచనలు, సలహాలతో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశా రు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎంకు సోమవారం ఆయన ట్విట్టర్, ఈ మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ, స్టేషన్ లో వివిధ గ్రేడ్‌లు / రకాల వెయిటింగ్ హాళ్లు, రిటైరింగ్ రూములు, మంచి ఫలహారశాలలు / ఆచరణీయమైన రిటైల్ షాపులు, ఉన్నత శ్రేణి ప్లాట్‌ఫారాలు (760-840 ఎం.ఎం.) ఏర్పాటు చేయాలన్నారు. దీర్ఘకాలిక దృష్టి, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతర ప్రాతిపదికన ఆధునికీకరించేలక్ష్యంతో అనకాపల్లి రైల్వే శాఖ స్టేషన్‌ను ‘అ మృత్ భారత్ స్టేషన్’పథకంలో కేంద్రం ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.