జోగుంపేటలో ఎమ్మెల్యే పెట్ల చిత్రపటానికి క్షీరాభిషేకం


Ens Balu
46
Golugonda
2023-08-01 07:03:47

నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమాలకు మద్దతుగా జోగుంపేటలో గొలుగొండ వైఎస్ ఎంపీపీ జక్కు నాగమణి ఆధ్వర్యంలో పెట్ల ఉమా శంకర్ గణేష్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ తన రాజకీయ స్వలాభం కన్నా ప్రజా శ్రేయస్నే మిన్నని భావించి నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణతో పాటు ఎన్నో ఏళ్లపాటు అభివృద్ధికి నోచుకోని ఆరిలోవ అడవి రోడ్డు మార్గం విస్తరణ చేయడం ఒక్క ఎమ్మెల్యే వలనే సాధ్యమైందన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్నామని కోర్టుకెళ్లిన బాధితులతో స్వయంగా ఇళ్లకు వెళ్లి నర్సీపట్నం పట్టణాభివృద్ధికి సహకరించాలని విన్నవించిన విధానం చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపో తుం దన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి, జక్కు అప్పలస్వామి నాయుడు, పి.నాగరాజు, పి.అప్పలనాయుడు, వి.సత్యనారాయణ, జి.అప్పారా వు, కె.గంగ న్న, కె.శ్రీను జి. కన్నయ్య అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
సిఫార్సు