18ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేయించుకోవాలని కొయ్యూరు మండల బూత్ కన్వీనర్ రమణ మండల మహాశక్తి మహిళా కార్యదర్శి మీనా అన్నారు. సోమవారం కొయ్యూరు గ్రామంలో ఓటర్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ ఓటరు నవీకరణ కార్యక్రమం చేపడుతోందని, ఓటరు కార్డులు తప్పులు, అడ్రసు, నూతన కార్డుల రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భారతదేశంలో ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని దీనివల్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ముఖ్యంగా యువత స్వచ్చందంగా ముందుకివచ్చి ఓటరుగా నమోదు చేయించుకోవాలని అన్నారు. దానికోసం ప్రతీ గ్రామ సచివాలయ పరిధిలోని బిఎల్వోలను సంప్రదించాలని సూచించారు.