చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసకోర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పెద్ద లక్ష్యాన్ని సాధించగలిగారని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగు పెట్టేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నించినా సాధించలేని విజయాన్ని భారత శాస్త్రవేత్తలు సాధించి సరికొత్త అధ్యాయానికి తెర తీశారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ విజయం భారతీయులందరికీ అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి, వాటిలో విజయం సాధించి ప్రపంచ దేశాలలోని భారతదేశం అగ్రస్థానంలో నిలవాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇస్రో శాస్త్రవేత్తలు మార్గదర్శకులుగా నిలిచే రోజు అతి దగ్గరలోనే ఉందని మంత్రి అమర్నాథ్ అన్నారు.