మానవ హక్కుల కాపాడుటం అందరి బాధ్యత అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి.సంపత్ కుమార్ అన్నారు. అనకాపల్లి శ్రీ శిరిడి సాయి లా కాలేజీలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఆయనముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మానవ హక్కులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. హ్యూమన్ రైట్స్ సభ్యులు విధి విధానాలు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. న్యాయవాది విద్యార్థులకు తమ వృత్తిలో నైపుణ్యం పెంచుకునేందుకు సీనియర్ లాయర్ల దగ్గర నుంచి తగిన శిక్షణ, సూచన, సలహాలు తీసుకోవాలని సూచించారు. అనంతరం లా కాలేజీ విద్యార్థులకు న్యాయవాది వృత్తిలో మరింత నైపుణ్యం సంపాదించేందుకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో నేషనల్ లీగల్ సెక్రటరీ కాండ్రేగుల లీలా హరిప్రసాద్, అడిషనల్ స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ న్యాయవాది బి. ఎస్.వి రాజుగోపాల్, లా కాలేజ్ కరస్పాండెంట్ పి, వెంకట్రావు, ప్రిన్సిపల్ పి. శ్రీధర్, లీగల్ అడ్వైజర్లు షేక్ నజీరా వసంత్, జగదీష్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి బి .లీలాప్రసాద్, నేషనల్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ మురళీమోహన్, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు చందర్రావు,సభ్యులు ఆదిలక్ష్మి వెంకటలక్ష్మి అనుపమ యాదవ్, రూపదత్, శ్రీధర్, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.