నక్కపల్లికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సీఎం వైఎస్ జగన్ చలవే..


Ens Balu
4
Payakaraopeta
2020-10-28 16:47:31

విశాఖజిల్లాలోని నక్కపల్లి మండల విద్యార్ధుల కష్టాలు కొత్తగా మంజూరైన డిగ్రీ కాలేజీతో తీరనున్నాయని పాయకరావుపేట ఎమ్మెల్యే,అసెంబ్లీ ఎస్సి వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు అన్నారు. బుధవారం  పాయకరావుపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి సీఎం వై ఎస్ జగన్ అన్ని విధాల సహకరిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ మంజూరు అయ్యిందన్నారు. తద్వారా నియోజకవర్గంలోని విద్యార్ధులంతా ఇక డిగ్రీ చదువులు నక్కపల్లిలోనే చదువకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాధానం మిన్న అనే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తించి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన నాణ్యమైన విద్య నిరుపేద విద్యార్ధులకు అందుంతని చెప్పారు. నియోజకవర్గానికి డిగ్రీ కాలేజి కల ఎమ్మెల్యే గొల్ల బాబురావు కృషితో సాకారమైందని నాలుగు మండలాల్లోని నాయకులు ఎమ్మెల్యే గొల్ల బాబురావు ను నాలుగు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
సిఫార్సు