ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పోరేట్ స్థాయి వైద్యం..


Ens Balu
3
Rowthulapudi
2020-12-29 10:50:02

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి వైద్య ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా అందుతోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం రౌతులపూడి సిహెచ్సీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ, ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు స్కానింగ్ లు, ఇతర రక్త పరీక్షలు చేయించుకోవాలంటే ప్రైవేటు ల్యాబులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని ఇపుడు అలాంటి అత్యాధునిక సదుపాయాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. త్వరలోనే నాడు నేడు క్రింద ప్రభుత్వ పీహెచ్సీలు, సీహెచ్సీలను ఆధునీక రిస్తుందన్నారు. అంతేకాకుండా ఎక్కడా ఎలాంటి పారామెడికల్ సిబ్బంది కొరత లేకుండా సిబ్బంది నియామకం కూడా చేపడుతుందన్నారు. ఇటీవలే ఆసుపత్రికి ల్యాబ్ టెక్నీషియన్ ను కూడా ప్రభుత్వం నియమించిందన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు చేసే స్కానింగ్ వివరాలను ఎమ్మెల్యే ప్రత్యేక వైద్యనిపులు డా.కిన్నెరను అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా ప్రభుత్వ వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణులు డా.సునీత, ఆసుపత్రి  సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు