పిల్లల తల్లులు తప్పక వేక్సిన్ వేయించుకోవాలి..
Ens Balu
4
Sankhavaram
2021-06-11 10:43:24
0-5 లోపు పిల్లల తల్లులు అపోహలు వీడి కోవిడ్ వేక్సిన్ తప్పక వేయించుకోవాలని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపునిచ్చారు. గురువారం శంఖవరం కోవిడ్ కేంద్రం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చిన వివరాలతో జాబితా సిద్దం చేశామన్నారు. వాటి ఆధారంగా టీకాలు వేయిస్తున్నామని చెప్పారు. తల్లులంతా టీకా నమోదుకి అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించాలన్నారు. వేక్సిన్ కేంద్రాల వద్ద తల్లులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఏ పనిచేసినా ముందు తరువాత చేతులు సబ్బుతో కడుక్కుంటూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైతే తప్పా ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.