సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంపీడీఓలు..
Ens Balu
4
Sankhavaram
2021-08-09 13:55:40
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతులు కల్పించిన సీఎం వైఎస్.జగన్మోహ నరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్యోగులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్రప్రసాద్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జె.రాంబాబు మాట్లాడుతూ, సీఎంవైఎస్ జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగా పంచాయతీరాజ్ శాఖలో అన్ని కేటగిరీల్లో పనిచే ఉద్యోగులందరికీ పదోన్నతులు లభిస్తాయన్నారు. ముఖ్యంగా ఎంపీడీఓలకు డిఎల్డీఓ, డిప్యూటీ సిఈఓ, వివిధ శాఖల్లో డైరెక్టర్లుగా పదోన్నతులు లభిస్తాయన్నారు. ఇన్నేళ్ల నుంచి ఎదురుచూసిన కల ఈ ప్రభుత్వంలో నెరవేరుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్రమణ్యం, పలువురు ఎంపీడీఓలు, శంఖవరం మండలంలోని పంచాయతీ కార్యదర్శిలు, స్థానిక సచివాలయ కార్యదర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య జూనియర్ సహాయకులు రమణమూర్తి, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, పడాల సతీష్, పడాల బాష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.