ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలి..
Ens Balu
3
Parvathipuram
2021-08-12 14:04:25
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి, కార్పొరేట్ స్కూళ్ళకంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది లక్ష్యమని ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి గురువారం తన పర్యటనలో భాగంగా జియ్యమ్మ వలస పేదమేరంగి జిల్లాపరిషత్ హైస్కూల్, చిన్నమెరంగి ఎం.పి.పి.స్కూల్, జెడ్ పి.హెచ్.స్కూల్ లలో నిర్వహిస్తున్న నాడు - నేడు పనులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం చేపడుతున్న పనులకు సంబంధించి ఆరా తీశారు. నాడు - నేడు పనులు పరిశీలన అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఆత్యదిక ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు, నాడు నేడు పనులు వేగవంతం చేయాలన్నారు, పిల్లలకు సంబంధించిన మెటీరియల్, పాఠశాలలో తరగతి గదులు, కొత్తగా వచ్చిన ఫర్నీచర్, పాఠశాల ఆవరణ పరిశీలించి తదుపరి చేపట్టవలసిన పనులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు సూచనలు అందించారు. ఈ పర్యటనలో జియ్యమ్మవలస మండలం రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఇంజనీరింగ్ ఆధికారులు, పాఠశాల ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.