జిసిసి అభివ్రుద్ధికి రాజీలేని క్రుషి.. చైర్మన్
Ens Balu
4
పాడేరు
2021-08-14 15:29:38
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ని బలోపేతం చేయడంతో పాటు, సిబ్బంది సమస్యల పరిష్కారాని శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని చైర్మన్ శోభా స్వాతి రాణి పేర్కొన్నారు. శనివారం ఆమె పాడేరులో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా జిసిసిలోని కొందరు సిబ్బంది సమస్యలను ఎమ్మెల్యే చైర్మన్ ద్రుష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె సంస్థలోని ఏ కేడర్ ఉద్యోగుల వలన సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని చెప్పారు. అంతేకాకుండా జిసిసిని మరింతగా బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులంతా సహకారం అందించాలని చైర్మన్ ఎమ్మెల్యే, ఎంపీలను కోరారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి జిసిసి ఉత్పత్తులు వినియోగించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తద్వారా జిసిసికి ముడి సరుకు అందించే గిరిజన రైతులకు మరింత అభివ్రుద్ధి చెందడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు డా.తమర్భ నర్సింగరావు , జిసిసి మేనేజర్ తో పాటు ఇతర అధికారులు, వై.ఎస్సార్ నియోజవర్గ నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.