ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిలో ఏపీ టాప్ వన్


Ens Balu
3
New Delhi
2022-04-25 09:18:08

హెచ్ఐవీ/ఎయిడ్స్ ఈ భయంకరమైన వ్యాది అంటెనే తెలియని వారు ఉండరు. ఈ వ్యాధి పేరు చెబితే భయపడుతుంటే.. ఇపుడు ఏకంగా ఆ హెచ్ఐవీ వ్యాధి ఆంధ్రప్రదేశ్ లోనే దేశంలో తొలి స్థానంలో ఉందనే విషయం సమాచార హక్కుచట్టడం ద్వారా బయటకు రావడం మరింత కలవర పెడుతోంది. రక్షణలేని లైంగిక కార్యకలాపాలతో మన దేశంలో ఎంతో మంది ఎయిడ్స్ బారిన పడుతున్నారు. కండోమ్స్ వాడకుండానే శృంగారంలో పాల్గొంటుండటం వల్ల ఎయిడ్స్ వ్యాధికి గురవుతున్నారు. మన దేశంలో గత పదేళ్లలో 17.08 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడినట్టు ఎయిడ్స్ నివారణ సంస్థ తాజాగా ప్రకటించింది. 2011 నుంచి 2021 మధ్య కాలంలో 17,08,777 మందికి ఎయిడ్స్ సోకిందని పేర్కొంది. కాగా  ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య గత దశాబ్ద కాలంగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2011-12 మధ్య కాలంలో 2.4 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడగా... 2020-21 మధ్య కాలంలో ఆ సంఖ్య 85,268కి పడిపోయింది. ఏపీలో గత పదేళ్లలో 3,18,814 మందికి ఎయిడ్స్ సోకింది. దీనితో ఆ వ్యాధి సోకిన వారిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలవడం కలవరపాటుకి గురిచేస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఎయిడ్స్ నివారణ సంస్థ సమాధానమిచ్చింది. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు. గతంలో ఎయిడ్స్ నియంత్రణా మండలి ద్వారా పరీక్షలు చేసి మందులు ఇచ్చేవారు.. స్వచ్చంద సంస్థల ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టేవారు. గత పదేళ్ల కాలం నుంచి ఆ కార్యకలాపాలు తగ్గించేయడంతో, వున్న హెచ్ఐవీ రోగుల నుంచి ఆ వ్యాధి లైంగిక సంపర్కం ద్వారి మరింత మందికి చేరింది. అందులోనూ కోవిడ్ లాంటి వైరస్ లు వచ్చిన క్రమంలో కూడా ఈహెచ్ఐవీ వ్యాధి వ్యాప్తి అధికంగా మారడం అందులోనూ ఏపీలోనే అత్యధిక కేసులు కావడం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది.