అక్టోబర్ నెల దర్శన టికెట్ల కోటా విడుదల


Ens Balu
6
Tirumala
2022-08-16 15:08:58

అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 18న ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్లో విడుదల చేయనుంది.  అయితే, వార్షిక బ్రహ్మోత్సవాలలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని టిటిడి ముందుగా ప్రకటించినట్లుగా, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవం తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.  భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరుతున్నారు.