కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై , మాజీ ముఖ్యమంత్రి యద్యూరప్ప శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వీరికి స్వాగతం పలికారు . స్వామివారి దర్శనం అనంతరం. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు . అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. సిఎం , మాజీ సిఎం లకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు . టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి , సీవీఎస్వో నరసింహ కిషోర్ ,ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలో టీటీడీ నిర్మిస్తున్న కర్ణాటక సత్రాల భవనాల నిర్మాణం పనులను కర్ణాటక ముఖ్యమంత్రి ,మాజీ ముఖ్యమంత్రి పరిశీలించారు . ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ , కళ్యాణమండపం , మొదటి బ్లాక్ నిర్మాణాలను జనవరి ఆఖరుకు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు . ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం టీటీడీ కి రూ 200 కోట్లు చెల్లించిందన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు విశ్వనాథ రెడ్డి , కర్ణాటక దేవదాయ శాఖ కమిషనర్ కుమారి రోహిణి సింధూరి , టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు , ఎస్ ఈ జగదీశ్వర్ రెడ్డి , ఈ ఈ జగన్మోహన్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.