జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్..?


Ens Balu
4
Hyderabad
2022-08-21 18:26:15

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఇప్పటి వరకూ రాజకీయం అంటే అధికార వైఎస్సార్సీపీ, అటు తెలంగాణలో టీఆర్ఎస్ ఇటు ప్రతిపక్ష హోదా లేకపోయినా టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ లే అనుకున్నారు అంతా.. అయితే అది కొంత కాలమేనని కొత్త తరం రాజకీయాల్లోకి వస్తే ఆ పరిస్థితులు బాగా మారిపోతాయని.. దానికోసం జాతీయ పార్టీలకు చెందిన మంత్రులు వేసే ఎత్తుగడలు, కలయికలు రాజకీయంలో వేడిని మరింతగా రాజేస్తారనే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్రమంత్రి అమిత్ షా బేటీతో తెరపైకి వచ్చింది. తెలంగాణాలో బీజేపీ తరపున పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ మీట్ కి ఆహ్వానించడం..దానికి మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాగస్వామ్యం కావడం ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ఊహాగానాలకు తెరలేపినట్టు అయ్యింది. అమిత్ షా లాంటి కేంద్ర మంత్రి నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం, త్రిపులార్ సినిమాలో కొమరం భీమ్ పాత్ర విషయంలో ఒదిగి యాక్టింగ్ చేసిన ఎన్టీఆర్ ను అభినందించడానికేనని చెప్పినా.. తెలుగు రాష్ట్రాల్లో వీరి కలయిక మాత్రం ఒక పెద్ద రాజకీయ చర్చకే దారి తీసిందనే విషయం ఇపుడు వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇపుడున్న రాజకీయపార్టీల్లోని నేతల కంటే భిన్నంగా కొత్త రక్తాన్ని, యువతరాన్ని తీసుకురావడం ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయడం ప్రారంభించారనే ఊహాగానాలకు ఆద్యం పోసినట్టు అయ్యింది. అయితే అమిత్ షాను కలిసిన ఎన్టీఆర్ మాత్రం తన త్రిపులార్ సినిమా విషయంలోనే కలిసి మాట్లాడినట్టుగా చెప్పుకొచ్చారు. చూడాలి అమిత్ షా..జూనియర్ ఎన్టీఆర్ కలయికపై ఎలాంటి ఊహాగానాలు, రాజకీయాలు మొదలై జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఏం జరుగుతుందనేది..!