ఆంధ్రప్రదేశ్ కి రూ.948.35 కోట్లు విడుదల


Ens Balu
13
న్యూఢిల్లీ
2022-09-01 13:06:44

కేంద్రప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ కు రూ.948.35 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా గ్రామపంచాయతీల ఖాతాలకు వెళ్లనున్నాయి. పంచాయతీల్లో త్రాగునీరు, పారిశుధ్యం,  ఇతర అభివ్రుద్ధి పనుల నిమిత్తం ఈ నిధులను వినియోగించనున్నారు. గతంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా పనులకు వినియోగించేది. ఇటీవలే కేంద్రం అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశాలు జారీ చేయడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే రానున్నాయి. వాటిని పంచాయతీ బోర్డు సభ్యులు తీర్మానించి గ్రామాల్లో మౌళిక సదుపాయాలకు ఖర్చు చేస్తారు. చాలా కాలం తరువాత కేంద్రం నుంచి నిధులు విడుదల కావడంతో ఇటు రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని గ్రామపంచాయతీల సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ పంచాయతీల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా సర్పంచ్ లచేతి నుంచే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ నిధులు రాకతో మళ్లీ పంచాయతీల్లో పనలు అభివ్రుద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.