ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన -2014 విభజన, సవాళ్లు అనేది అన్ని రకాల పోటీల పరీక్షల్లో ప్రత్యేకంగా అడుగుతున్నారు. దీనికోసం నవ్యాంధ్రాప్రదేశ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అభ్యర్ధులు చదువుకోవడం ద్వారా మంచి మార్కులు సాధించడానికి వీలుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఏపీ బైఫర్ కేషన్ యాక్టు అనికూడా అంటారు. భారత రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ను అనుసరించి స్టేట్ రీ ఆర్గనైజింగ్ యాక్టును చేపడతారు. దీనినే మనం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటాం. ఇది పూర్తిగా కేంద్రజాబితాకి చెందిన అంశం. స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్టు అనేది పూర్తిగా పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది. ఈ బిల్లును పార్లమెంటు రూపొందించి, ఇక్కడే ఆమోదించి తద్వారా రాష్ట్ర పునర్విభజన లేదా పునర్వ్యవస్థీకరణ చేపడతారు. ఈ విషయంలో చట్టం చేసే అధికారం, నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటు, కేంద్రానికే వుంటుంది. రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు.
అయితే రాష్ట్రాలను విభజించే సమయంలో మాత్రం రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను తీసుకునే అవకాశం మాత్రం కల్పించారు. ఇక్కడ ఏ రాష్ట్రాన్ని అయితే పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారో ఆ రాష్ట్ర శాసన సభ అభిప్రాయాన్ని కూడా కేంద్రంలేదా పార్లమెంటు తెలుసుకునే అవకాశం ఉందని ఈ చట్టం ద్వారా తెలుస్తుంది. రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేయడానికి ముందు అసెంబ్లీకి పంపి అభిప్రాయాన్ని మాత్రమే తీసుకున్నారు. కానీ ఇక్కడ కేంద్రం, లేదా పార్లమెంటు చేయాలనుకున్న చట్టాలను రాష్ట్రాలకు అడ్డుకునే అధికారం మాత్రం ఇవ్వలేదు. దానికి కారణం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనే అంశం కేంద్రప్రభుత్వానికి చెందిన అంశం కావడమే. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే ఇక్కడ కేవలం రాష్ట్ర విభజన మాత్రమే కాకుండా ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా వేరుచేయడంతోపాటు, అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి..
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలోకి వచ్చే అంశాలు
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం, రాష్ట్రాల సరిహద్దులు మార్పు చేయడం, ఒక రాష్ట్రంగా కొనసాగుతున్న దానిని కేంద్ర పాలిత రాష్ట్రాలుగా మార్చడాన్ని కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణగానే భావించాలి. కేంద్ర పాలిత ప్రాంతాల సరిహద్దుల మార్పుని స్టేట్ బైఫర్ కేషన్ యాక్టుగానే భావించాల్సి వుంటుంది. దానికి ఉదాహరణగా ఇటీవలనే దాద్రానగర్ హవేలి, డయ్యూడామన్ అనే కేంద్ర పాలిత ప్రాంతాలను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా వీలినం చేశారు దీనిని కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశంగానే చెప్పబడుతుంది. అంతేకాకుండా రెండు రాష్ట్రాలుగా ఉన్నవాటిని, కేంద్రపాలిత ప్రాంతాల విలీనాన్ని, వాటి పేర్లను మార్చడాన్ని కూడా పునర్వ్యవస్థీకరణ గానే చెప్పాలి. 2014 నుంచి కేంద్రపాలిత ప్రాంతాలు, నూతన రాష్ట్రాలు ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు మార్పు ఇలా చాలా వరకూ జరిగాయి. వీటన్నింటిపైనా తొలుత అవగాహన పెంచుకోవడంతోపాటు పునర్వ్యవస్థీకరణ అంటే చాలా అంశాలు అందులో మిలితమై వుంటాయని కూడా మనం గుర్తించాల్సి వుంటుంది. భారత రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ను అనుసరించి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం పార్లమెంటుకి ఉందని చెప్పాలి. ఇది పూర్తిగా కేంద్ర జాబితా కనుక దీనిపై పూర్తి అధికారం కూడా కేంద్రానికే వుంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ను విభజించే సమయంలో తెలంగాణకు చెందిన ఏడు రెవిన్యూ మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. దానిని కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ గానే చెప్పుకుంటాం.
రాష్ట్రంగా కొనసాగుతున్న ఢిల్లీని 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్పు చేశారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా వున్న వాటిని కూడా రాష్ట్రాలుగా మార్పు చేశారు. ఉదాహరణకు 1956 నుంచి1971 వరకూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా కొనసాగిన హిమాచల్, మణిపూర్, త్రిపుర అనే ప్రాంతా రాష్ట్రాలుగా మార్పు చేశారు. అయితే 1971లో వాటిని పునర్వ్యవస్థీకరణ చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నవాటిని రాష్ట్రాలుగా కూడా మార్పు చేశారు. ఇక్కడ చూసుకుంటే రెండు రాష్ట్రాలను విలీనం చేసినా, కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చినా, రాష్ట్రాల పేర్లు మార్చినా ఈ మొత్తం ప్రక్రియను పునర్వ్యవస్థీకరణ ప్రక్రియగానే చెబుతారనే విషయాన్ని గుర్తించాలి. గతంలో వెస్ట్ బెంగాళ్ అనే ప్రాంతాన్ని కూడా వెస్ట్ బెంగ్లా అని పేరు మార్చారు. ఇదంతా పునర్వ్యవస్థీకరణ బిల్లుగానే చెప్పుకుంటాం. అంతేకాంకుడా పాండిచ్చెరి అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా పుదుచ్చెరిగా పేరు మార్చారు.. అంతేకాకుండా మద్రాస్ అనే రాష్ట్రాన్ని తమిళనాడుగా మార్పు చేశారు. ఇవి కూడా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియే అవుతాయి.
ముఖ్య గమనిక.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయంలో అనుసరించే విధి విధానాలు, రాజ్యాంగపరమైన అంశాల కోసం వచ్చే ఆర్టికల్ లో తెలుసుకుందాం...