షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్థులు విభజించండి


Ens Balu
30
New Delhi
2022-12-14 15:33:26

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన ఆలస్యం కావడం, దానిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు  పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంస్థల విభజన ఆలస్యంతో ఏపీ నష్టపోతుందని పిటిషన్‌ లో ప్రభుత్వం పేర్కొంది. కాగా ఈ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు ఆస్తులు ఉణ్నాయని.. తెలంగాణలో ఉన్న దాదాపు 91 శాతం సంస్థలు విభజన అంశంపై తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని పిటిషన్
 లో పేర్కొంది. సంస్థలవిభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.