తిరుపతికి చెందిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య వాసవి నిత్య అన్నదాన ట్రస్టుకు చెందిన ఉమామహేశ్వరి దంపతులు రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు విరాళం డిడిని శుక్రవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్విబిసి సిఇవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి టిటిడి అధికారులు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.