భారత ప్రధాని మోదీపై బీబీసీ చిత్రీకరించిన2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటీషన్లు విషయంలో కేంద్రానికి చుక్కెదురైంది. ఈ పిటీషన్లపై ఈరోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా దీనిపై సమాధానమివ్వాలని కోరింది. తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్‌కు వాయిదా వేసింది. దీనితో బిబిసి డాక్యుమెంటరీ విషయంలో కేంద్రానికి బంగపాటు తప్పలేదు. మోదీ వలనే అల్లర్లు జరిగాయనే సారాంశంతో ఈ డాక్యుమెంటరీని దేశవ్యాప్తంగా పలు యూనివర్శిటీలో కూడా ప్రదర్శించడం విశేషం.