ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా ఎస్.అబ్దుల్ నజీర్


Ens Balu
14
Delhi
2023-02-12 05:10:26

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్డి ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ని నియమించింది. దేశంలో 12 రాష్ట్రాల గవర్నర్ లను మార్పుచేసిన కేంద్రం ఏపీలోనూ గవర్నర్ ను మార్చింది. నిన్నటి వరకూ ఏపీ గవర్నర్ గా భిశ్వభూషన్ హరిచందన్ గవర్నర్ గా వ్యవహరించేవారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశియారి, లద్దాక్ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ రాధాకృష్ణ రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.  అరుణాచల్‌ ప్రదేశ్ కి. త్రివిక్రమ్‌ పర్నాయక్‌,  సిక్కింకి లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య,  ఛత్తీస్‌ఘఢ్ కి బిశ్వభూషణ్‌ హరిచందన్‌, మహారాష్ట్ర కి రమేష్‌, మేఘాలయకి చౌహాన్‌ లను మార్పు చేసింది.