బిఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా పార్టీ కార్యక్రమాలు, చేపట్టబోయే విసర్తణకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు మూడు భాషల్లో దినపత్రికలు ప్రారంభించాలని చూస్తుందట. తెలుగు రాష్ట్రాష్ట్రాల్లో నమస్తే తెలంగాణతోపాటు, నమస్తే ఆంధ్రప్రదేశ్, ఇక ఇంగ్లీషు, జాతీయ భాష హిందిలో కూడా పత్రికలు తీసుకురావడంతోపాటు మూడు భాషల్లో ఛానళ్లు కూడా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. దేశస్థాయిలో రాజకీయాలు చేయాలంటే ప్రాంతీయ భాషల మీడియా ఢిల్లీలో పనిచేయదు. దీనితో దేశంలోని అత్యధికంగా మాట్లాడే భాష హిందీ, ఇంగ్లీషులో టివి ఛానళ్లు, తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు పత్రికలు కావాల్సి వుంది. దేశవ్యాప్తంగా పత్రికలు, ఛానళ్లు మూత పడుతున్నవేళ బీఆర్ఎస్ భారీగా మీడియాని విస్తరించడం ఇపుడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది..!