ఒడిసాలోని భువనేశ్వర్‌కు చెందిన శివం కాండెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర శనివారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, దేశంలోని ప్రముఖ భాషల్లో శ్రీవారి ఛానళ్లు ప్రారంభించి దేశంలోని అన్నివర్గాల ప్రజలకు స్వామి వైభవం చేరువ చేయాలని కోరారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.