నిరుపేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఉన్నది


Ens Balu
15
2022-10-12 13:33:22

నిరుపేదల సంక్షేమం కోసమై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ 25వ డివిజన్‌లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. భానువారివీధి, పాలెపువారివీధి ప్రాంతాల్లో సిటీ ఎమ్మెల్యే  ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గడచిన మూడేళ్ళలో ప్రభుత్వం అందించిన లబ్ధిని ప్రజలకు వివరించారు.  ప్రజలు  ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాల్సిందిగా అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే అవకాశం దక్కడం ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో సంతోషంగా భావిస్తున్నానన్నారు. 

ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండడం ప్రజల అదృష్టంగా పేర్కొన్నారు. నవరత్న పథకాలు ద్వారా పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపారన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికగా లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాల సొమ్మును నేరుగా ఖాతాల్లో జమ చేసే వి«ధానం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో కాకినాడ నగరంలోని అన్ని డివిజన్లలోను పర్యటిస్తామని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో  కౌడ ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్, కార్పొరేషన్‌ కార్యదర్శి ఎం.ఏసుబాబు, టీపీఆర్వో మానే కృష్ణమోహన్, సచివాలయ ఉద్యోగులు, మాజీ కార్పొరేటర్లు జగన్నాథన్‌విజయ్‌కుమార్, రాగిరెడ్డి బన్ని, కామాడి సీతదశరథ్, నల్లబెల్లి సుజాత, బొర్రా రమణ, సంగాని నందం, కొప్పనాతి సత్యనారాయణ, వెలమల మల్లేశ్వరరావు, పేర్ల జోగారావు,   పినపోతు సత్తిబాబు, చవ్వాకుల రాంబాబు, వాసిరెడ్డి రాంబాబు,  పలువురు అధికారులు పాల్గొన్నారు.