బీఆర్ఎస్ పై జనసేన నాదెండ్ల కీలక వ్యాఖ్యలు


Ens Balu
15
Visakhapatnam
2023-01-05 14:45:03

ఓ పక్క ఓటమి భయనం, మరోప్రక్క ప్రతిపక్షాలు ప్రజలకు దగ్గరవుతున్నారనే ఆందోళనతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చీకటి జీవోలు తెచ్చారని..బి.ఆర్.ఎస్. పార్టీ జగన్ రెడ్డికి సహకారం అందించడానికే ఏపీకి అడుగు పెడుతుందని జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఓటు చీల్చడానికి బీఆర్ఎస్ ముసుగులో ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ కోసం మీరు నిలబడ్డారు.. బంగారు ఆంధ్రప్రదేశ్ కోసం కాదు అంటూ కేసీఆర్ కి చురకలు అంటించారు. రాజకీయాల్లో నిజాయతీతో కూడిన ఆలోచనా విధానం 
ఉండాలి. మీటింగులు పెట్టుకుని జాయినింగులు చేసుకుంటే అయిపోదు. కృష్ణా-గోదావరి జలాల విషయంలో మీ ప్రణాళిక ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి ఆలోచనతో వచ్చి సేవా కార్యక్రమాలు చేయగలరో ప్రజలకు వివరించిన తరువాత అపుడు ఏపీలోకి అడుగు పెట్టాలని సూచించారు.

కేసీఆర్ ఓవర్ నైట్ పార్టీ పెట్టి దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాడుతాను అనడం.. మీ విధానాల్లో నిజాయతీ ఏది? ఆంధ్రప్రదేశ్ కి మీరు ఎలా ఉపయోగపడతారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోలిశెట్టి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.