వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్, విస్జా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా గురువారం ఉదయం మెగా క్రికెట్ సంబురం ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి షెడ్యుల్ ప్రకారం మ్యాచ్ జరగనున్నాయి. విశాఖ పోర్టు స్టేడియం వేదికగా జరిగే జర్నలిస్టుల క్రికెట్ వేడుకగా జరగనుం ది. దీనికి ఇప్పటికే ఏఏ మ్యాచ్ లు ఎవరెవరి మధ్య జరగనున్నాయనే విషయాన్ని నిర్వాహకులు ప్రకటించి, టీమ్ లకు తెలియజేశారు. నిర్ణీత సమయానికి ఈ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తాజా అప్డేడ్స్ ను ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి..!