గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగుల ప్రసూతిసెలవులపై నోరు మెదపని ఏపీఎన్జీఓ..?
Ens Balu
2
Visakhapatnam
2021-12-07 03:18:14
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వం సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో మహిళా ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాల్లో ముందుండే ఏపీఎన్జీఓ కూడా గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో నోరు మెదపకపోవడం ఉద్యోగులకు అసహనాన్ని కలిగిస్తున్నది. రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ గా వున్న ఏపీఎన్జీఓ సచివాలయ ఉద్యోగుల విషయంలో అనేక డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చని ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కూడా సిద్దపడింది. ఈ తరుణంలో వారికి గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగు మద్దతు చాలా అవసరం. అయితే ఈ ఉద్యోగుల విషయంలో ఎల్లప్పుడూ ప్రకటనలు తప్పితే సీరియస్ గా వ్యవహరించిన దాఖలాలు లేవు ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు తీసుకున్న దానికి సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ మరో ఆరు నెలలు వెనక్కి వెళుతుందనే విషయం, గ్రేడ్5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 అమలు చేయకపోవడం, అక్టోబరు 2నాటికి ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయకపోవడం, వివిధ కారణాలతో ప్రభుత్వం కాలయాపన చేయడం, ప్రక్రుతి విపత్తు కరోనా నెపంతో రెండవ శనివారాలు, ఆదివారాలు అదనపు విధులు చేయించుకున్న ప్రభుత్వ అధికారుల విషయంలోనూ ఏపీ ఎన్జీఓ సక్రమంగా నోరు మెదకపోవడం పట్ల సచివాలయ ఉద్యోగులు, ఏపీ ఎన్జీఓకి తమ మద్దతు ఇవ్వాలా వద్దా అనే చర్చకు సామాజిక మాద్యమాల్లో తెరలేపారు. ఇదే సమయంలో తమ న్యాయపరమైన డిమాండ్లు పీఆర్సీ, డీఏలు, ఎరియర్స్ విడుదల సమస్యలతో పాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపైనా ఏపీఓ ఎన్జీఓ పోరాటం చేస్తుందని చెప్పినా గ్రామసచివాలయ ఉద్యోగులు ఎవరికీ నమ్మకాలు అయితే లేవనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్రనేతలు ఎక్కడికి వెళ్లినా గ్రామసచివాలయ ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈరోజు విశాఖలో జరిగే రాష్ట్రనేతల సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రధాన సమస్యలపై స్పందించకపోతే, తమ యూనియన్ల ద్వారా మాత్రమే పోరాటం చేస్తాం తప్పితే ఏపీఎన్జీఓతో అంటీ ముట్టనట్టు ఉండాలనే భావనకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వచ్చినట్టు సామాజిక మాద్యమాల్లో చర్చలు నడిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్రనేత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యలపై విశాఖలో జరిగే సమావేశంలో ఏ మాట్లాడి, ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెడతారనిదే ఇపుడు చర్చనీయాంశం అయ్యింది..