సచివాలయ ఉద్యోగులను అణచివేయాలని చూస్తే.. ముందు ముందు సహకారం ప్రశ్నార్ధకమే..


Ens Balu
9
Tadepalli
2022-01-09 07:56:32

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీ ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రికకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం.. వీరిని కాదని ఇతర శాఖలకు ప్రాధాన్యత ఇచ్చి వీరిని పక్కన పెట్టడం ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో..మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమే వాదన తెరపైకి తీసుకు వస్తున్నారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తే తప్పా మనకి  ప్రభుత్వ సహకారం, గుర్తింపు ఇచ్చిన మాదిరిగానే ఉంటుందనే సంకేతాలు ఇస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరించాలని, అణచివేయాలని చూస్తే.. ముందు ముందు సహకారం కూడా అదే స్థాయిలో వుంటుదనే విషయాన్ని మీడియాకి లీకులిస్తున్నారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యస్థ ద్వారానే నవరత్నాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందిస్తున్నది. వీరి సహకారం ప్రభుత్వానికి కొరవడితే సంక్షేమం పడకేడయం తప్పదు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు విరమించుకుంటే దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో చాలా తీవ్రంగా వుంటుందనేది ఇపుడు ఒక్కసారిగా తెరపైకి వచ్చేసింది. రెండేళ్ల పాటు చెప్పిన పని, చెప్పని పని చేసిన తమకు ఇదేనా గుర్తింపు అంటూ ఉద్యోగుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశం అవుతుంది. 

కరోనా సమయంలో అన్నిప్రభుత్వ శాఖలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులతోనే పనులు చేయించిందని, కరోనా టీకా విషయంలో ప్రాణాలకు తెగించి ప్రజలందరికీ సేవలు చేస్తే ఇదేనా తమకు దక్కే గౌరవం అంటున్నారు ఉద్యోగులు. తొలిరోజు అధికారిక వాట్సప్ గ్రూపుల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్, జెసి, మండల స్థాయిలో ఎంపీడీఓలు సచివాలయ ఉద్యోగులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే హెచ్చరికలను మాత్రం ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదు. అవసరం అయితే పెన్ డౌన్ చేయాలనే నిర్ణయంతోనే సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.  కొన్ని చోట్ల ఉద్యోగులు మాత్రం భయపడి కొన్ని అధికారిక వాట్సప్ గ్రూపుల్లోకి మళ్లి వెనక్కి చేరిపోయారు. కానీ చాలా చోట్ల మాత్రం ఏం జరుగుతుందో చూద్దామనే కోణంలోనే ఉద్యోగులు తెగించే ఉన్నట్టు కనిపిస్తుంది..

కాగా సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేసిన  ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్.జగ్మోహనరెడ్డి దగ్గరకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా సీఎం కూడా బాధపడినట్టు విశ్వసనీయంగా తెలియవచ్చింది. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వశాఖ ఉద్యోగులు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడమేంటనే విషయాన్ని ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం అందుతోంది. దీనితో గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆగమేఘాలపై చర్చలు జరిపారు. ఆపై కలెక్టర్లు, జెసిలు, డిపీఓలు, ఆఖరికి ఎంపీడీఓలు కూడా సచివాలయ ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల ద్వారా, వారికి అనుకూలంగా వున్న కొందరు గ్రేడ్-5 కార్యదర్శిల ద్వారా వార్నింగులు ఇచ్చారు. ఆ సమయంలో సచివాలయ ఉద్యోగులు అప్పటికి కొంత మంది మెత్తబడినా.. తమకు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పోల్చుకుంటే తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందనే విషయాన్ని మనసులో పెట్టుకున్నారు.  ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులపాటు తమకు సమ న్యాయం చేయని ప్రభుత్వానికి ఎందుకు సహకారం అందించాలనే వాదనను తెరపైకి తీసుకు రావడం చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి అదీ కూడా నిజమే.. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సుమారు 13 లక్షలకు పైగా వున్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, అధికారులకు న్యాయం చేసినపుడు రాని ఆర్దిక భారం ఒక్క లక్షా 30వేల ఉద్యోగులం ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనివారికి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారికి ప్రొబేషన్ పూర్తిచేయడం వలన ఆర్ధిక భారం పెరిగిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వంపై గౌరవంతోనే కేవలం 15వేల రూపాయల జీతానికే పనిచేశామని ఇంకెంత కాలం అదే జీతాలకు పనిచేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఏం చేసినా అలా పడుంటారని వారి కోసం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదనే విషయాన్ని ప్రభుత్వంలోని కొందరు అధికారులు, సలహాదారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతుంది. అంతకీ మొండి పట్టు పడితే సస్పెండ్ చేస్తాం..ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామని బెదిరిస్తే.. వాళ్లే దారిలోకి వస్తారని కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్టుగా రాష్ట్రంలో అందరు సచివాలయ ఉద్యోగుల సామాజిక గ్రూపుల్లో తీవ్రమైన చర్చనడుస్తుంది. ఆ మాట కొస్తే సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగుల కారా, వారికి ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించవా అంటే అంత అవసరం లేదన్నట్టుగానే ఇప్పటి వరకూ చేస్తూ వచ్చారని..అందుకే నేరుగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా జూన్ తరువా అందరికీ ఒకేసారి సర్వీసు రెగ్యులర్ చేస్తామని ప్రకటించారని సచివాలయ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా జీతం నష్టపోయామని, మరో ఆరు నెలలు జీతం కోల్పోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకెళ్లే తమను కాదని, మిగిలిన ప్రభుత్వ శాఖల ప్రయోజల కోసం ఆలోచిస్తే...తమ పరిస్థితి ఏంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యవహారం కొనసాగితే ముందు ముందు తమ సహకారం ప్రభుత్వం అందుకోవడం కష్టమని కూడా మీడియాకి లీకులిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి కూడా అలానే కనిపిస్తున్నది. అణచివేయాలని చూస్తే ఎవరైనా తిరగబడతారనే లాజిక్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర అధికారుల జిల్లాల్లో జెసిలు, మండలాల్లోని ఎంపీడీఓలు మరిచిపోవడం కూడా చర్చనీయాం అవుతుంది. ఈ లోపాలనే ప్రతిపక్షాలు కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటే వాటి ప్రభావం వచ్చే ఎన్నికలో ఖచ్చితంగా కనిపించే ప్రమాదం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో రేపు రాష్ట్ర రాజధానిలో జరిగే ఉద్యోగ సంఘాల సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటేందనే విషం ఉత్కంఠను రేపుతోంది. చూడాలి ఏం జరుగుతుందనేది..!