ఏపీసచివాలయ ఉద్యోగులకు ఝలక్


Ens Balu
3
Tadepalli
2022-06-29 15:47:34

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. హైదరాబాదు నుంచి రాజధానిని తరలించిన తరువాత స్టేట్ కేపిటల్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం వసతి కల్పించింది. తాజా ఆ వసతిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కేవలం ఒక్కరోజు మాత్రమే వారికి సమయం ఇచ్చి ఉన్న ఫలంగా ఉంటున్న ప్లాట్లు ఖాళీ చేసి ఇవ్వాలంటూ సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఆదేశాలు జారీ చేయడంతో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లోని శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.  కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలోకి పడ్డారు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులంతా. రేపటిలోగా ప్రస్తుతం ఉద్యోగులు ఉంటున్న ప్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలనే నిబందనపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. అంతేకాకుండా ఉంటున్న ప్లాట్లకు ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని అని కూడా జారీచేసిన ఉత్తర్వులలో పేర్కొనడం విశేషం. కాగా , హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి ఉచిత వసతి కల్పిస్తూ వచ్చింది. నేటితో ఆ ఉచిత వసతి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడేసింది.