ప్రధాని నరేంధ్ర మోదీ ప్రకటనపై హర్షం


Ens Balu
4
Visakhapatnam
2022-07-05 10:45:25

భరతమాత ముద్దు బిడ్డ, మన్యంలో మహోదయం స్రుష్టించిన విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడి సంచరించిన ప్రదేశాలను అభివ్రుద్ధి చేస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడంపై అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నాటి నుంచి నేటి వరకూ కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ఒక్క ప్రధాని అల్లూరి కోసం ఇంత పెద్ద స్థాయిలో ప్రకటన చేయలేదన్నారు. మొట్టమొదటి సారిగా ఏన్డీఏ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి అల్లూరి సంచరించన ప్రదేశాలను అభివ్రుద్ధి చేయాలని ప్రకటన చేయడం ఆ మహానుభావునికి నిజమైన గుర్తింపు నిచ్చినట్టు అయ్యిందన్నారు. భారత దేశ చరిత్రలో బ్రిటీషు సేనలపై అల్లూరి చేసిన వీరోచిత పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. అంతటి మహానుభావుడు నడయాడిన ప్రదేశాలకు ఆయన జన్మంచిన 125 సంవత్సరాలకు కేంద్రప్రభుత్వం గుర్తింపు తీసుకువస్తామని చెప్పడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయమన్నారు. లంబసింగి వద్ద అల్లూరి మ్యూజియంతోపాటు,చింతపల్లి పోలీస్ స్టేషన్ లను అభివ్రుద్ధి చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం కూడా ఒక చరిత్రగా నిలిచిపోతుందన్నారు. ప్రధాని చేసిన ప్రకటనను అమలు చేస్తూ తక్షణమే పనులు ప్రారంభించేలా చేయాలని కోరుతున్నట్టు ప్రకటించారు. అల్లూరి జన్మించిన ప్రదేశం, చదవుకున్న ప్రాంతం, కీలక పోరాలు, తిరుగుబాటు చేసిన క్రిష్ణదేవిపేట ప్రాంతాలను సెంట్రల్ టూరిజం ప్రాజెక్టుగా అభివ్రుద్ధి చేయడం ద్వారా భావితరాలకు అల్లూరి చరిత్ర, ఆ మహానుభావుడు సంచరించన ప్రదేశాలు గుర్తుండి పోయాయని అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.