జూలై 8న సెప్టెంబరు వ‌స‌తి కోటా విడుదల


Ens Balu
2
Tirumala
2022-07-07 09:06:22

తిరుమ‌లలో వ‌స‌తి కోటాను జూలై 8వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.  సెప్టెంబరు నెల‌కు సంబంధించిన ఈ కోటాను విడుదల చేయడానికి టిటిడి అధికారులు సర్వంసిద్దం చేశారు.  అదేవిధంగా, శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు జూలై 12, 15, 17తేదీల్లో వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు  ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.  భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి తిరుమలలో వసతి కోటాను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని టిటిడి వసతి విభాగం అధికారులు కోరుతున్నారు.