ఏపీ పోలీస్ కానిస్టేబుల్ జనరల్ అభ్యర్థుల వయోపరిమితి 29 సంవత్సరాలకు, ఎస్ఐ కి 32 సంవత్సరాలకు వయస్సు పెంచాలని ప్రభుత్వాన్ని సీబీఐ మాజీ జెడి వి.వి.లక్ష్మీనారాయాణ కోరారు. శుక్రవారం
డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పలు జిల్లాలు పర్యటిస్తున్నప్పుడు SI/కానిస్టేబుల్, పోటీ పరీక్షలకు సన్నదమవుతున్న యువత కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగోలేక కోచింగ్ తీసుకోలేకపోతున్నామని..దానికి కోసం సహాయం చేయమని అడిగారని, వారి అభ్యర్ధన మేరకు ఐఏసిఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇచ్చి సహకరిస్తామని ముందుకు వచ్చారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం జేడీ ఫౌండేషన్, సదరు కోచింగ్ సెంటరుతో కలిసి సంపూర్ణ కోచింగ్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 45 వేల వరకు అభ్యర్ధులు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. అందులో 1000 మందిని మెరిట్ లో ఎంపికచేసి వారికి ఉచితంగా రాత పరీక్ష, గ్రౌండ్ ఈవెంట్స్, మెయిన్స్ వరకు పూర్తి కోచింగ్ online మరియు offline లో సేవలు అందిస్తామని చెప్పారు, ఆదివారం ఉదయం 9.30 నుండి 12.30 వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో 38 పరీక్ష కేంద్రాలలో రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 10 వరకు అభ్యర్ధులు పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఆశక్తి కలిగిన వారు 7093651037 వాట్సాప్ నెంబర్ కి HI అని సందేశం పంపిస్తే, పూర్తి వివరాలు పంపిస్తాం అని వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక దండి, కోఆర్డినేటర్ జగన్ మురారి,బుద్దాల కృష్ణ మోహన్ మురారి, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్, కోచింసెంటర్ ఇంచార్జ్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.