భారతదేశపు తొలి తెలుగు జాతీయ వార్త సంస్థ ఈఎన్ఎస్ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net కథనాలు అక్షర సత్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే మరోసారి నిరూపించింది. ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన తరువాత ఆ విధులన్నీ గ్రామ, వార్డు
సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తుందని.. వారినే ఎన్నికల విధులకు వినియోగించనున్నదని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ప్రత్యేక కథనాన్ని ఇటీవలే ప్రచురించింది. నేడు అదే విషయాన్ని నిజంచేస్తూ.. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ అధికారికంగా ప్రకటించారు.