27న శ్రీవారి ఆలయంలో బ్రేక్ ద‌ర్శనాలు రద్దు


Ens Balu
23
Tirumala
2022-12-25 07:49:15

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27న బ్రేక్ ద‌ర్శనాలు రద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. ఆరోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉన్న కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొన్నారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని మీడియా ద్వారా తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఏడాది స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ నిర్వహిస్తుంటారు.