ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి శుభవార్త చెప్పారు. ఇటీవలే ఇచ్చిన ఉద్యోగ ప్రకటనకు సంబంధించి అభ్యర్ధుల వయోపరిమితిని రెండేళ్లకు పెంచారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ నోటిఫికేషన్లు రాకపోవడం, చాలా మంది అభ్యర్ధులకు వయస్సు దాటిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖ ద్వారా వెళ్లిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ఆమోద ముద్రవేశారు. దీనిపై అధికారిక ప్రకటన సోమవారం వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వం అభ్యర్ధుల వయోపరిమితి రెండేళ్లు పెంచడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తం అవుతున్నది. అంతేకాకుండా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారిక సంఖ్య కూడా భారీగా పెరగనున్నది.