నిరుద్యోగులకు గుడ్ న్యూస్ మరో జాబ్ నోటిఫికేషన్..?


Ens Balu
28
Tadepalli
2022-12-25 11:43:40

ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. దానికోసం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో మిగిలిన ఉద్యోగాల భర్తీచేపట్టనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం 2019లో లక్షా 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా అపుడు 1.20వేల మంది మాత్రమే ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఆ తరువాత పలు ప్రభుత్వశాఖల్లో విధినిర్వహణలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల వారికి కారుణ్య నియామకాల క్రింద కొన్ని పోస్టులను భర్తీచేసింది. ఇంకా మిగిలిని ఉద్యోగాలను శాఖల వారీగా విడి విడిగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీచేయడానికి ఏర్పాట్లు పూర్తి అయినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దానికోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల భర్తీ వివరాలను ప్రభుత్వం సేకరించి ఉంచింది.