ఏపీలో26 జిల్లాల సంఖ్య ప్రభుత్వానికి కీడుని తెస్తున్నదా


Ens Balu
117
Tadepalli
2022-12-27 02:24:24

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని 26 జిల్లా సంఖ్య(2+6=8 ఈ సంఖ్య సంఖ్యాశాస్త్రం ప్రకారం దెయ్యం లేదా డెవిల్ సంఖ్య అంటారు) కీడు తెస్తున్నదా..అంటే అవుననే అంటున్నారు న్యూమరాలజిస్టులు. ఇదే సంఖ్యతో ప్రభుత్వం తన పరిపాలన కొనసాగిస్తే వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చ రిస్తున్న అంశం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన సమయంలోనే ఈ విషయాన్ని న్యూమరాలజిస్టులు ప్రభుత్వం దృష్టికి, కొందరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం అనుకున్నట్టుగా కేవలం 26 జిల్లాలనే రా జపత్రం (గెజిట్ నోటఫికేషన్) ద్వారా ప్రకటించి ప్రచురించింది. అప్పటి నుంచి చాలా విషయాల్లో ప్రభుత్వాకి అంతా కీడే జరుగుతున్నదని, కొత్త జిల్లా బిల్లుకి కేంద్రంలో రాష్ట్రపతి ఆమోద ముద్రలభించలేదని, పోలవరానికి నిధులు ఆగిపోయాయని, 3 రాజధాను అంశం ముందుకు వెళ్లలేదని, నవరత్నాల్లోని ముఖ్యమైన మధ్యపాన నిషేదాన్ని అమలు చేయలేకపో తున్నారని, అభివృద్ధి సక్రమంగా జరగక ఆర్ధికంగా ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయని..న్యూమరాలజిస్టులు చెప్పుకొస్తున్నారు. ఇటీవల కాలం ఆ ప్రచారం మరింత అధికమై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. అటు ప్రభుత్వం కూడా మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది..పరిపాలనా పరమైన ఇబ్బదులు, ప్రజల జిల్లా కేంద్రానికి వచ్చే ఇబ్బందులు తగ్గుతాయా అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం వస్తు న్నది.

26 సంఖ్య వెనుక ఏమున్నది..ఏం చెబుతుంది..
న్యూమరాలజీలో 8వ సంఖ్యలను డెవిల్ నెంబరు అనిపిలుస్తారు. అదే 9వ సంఖ్యను కింగ్ నెంబర్ అని పిలుస్తారు. కింగ్ నెంబరు కావాలని కోరుకునేవారు చాలా మంది వారు తీసుకున్న మొబైల్ నెంబరు గానీ, వాహనాల నెంబర్లు గానీ తొమ్మిది వచ్చేలా తీసుకుంటారు. టోటల్ 8 సంఖ్య వచ్చేలా ఎవరూ తీసుకోరు. 100 మందిలో ఈ 8వ అనే సంఖ్య ఒకటి నుంచి 5 గురు సభ్యులకు కూడా పనిచేయదని..ఇది కంప్లీట్ గా డివిల్ నెంబరు అని నమ్ముతారు. అదే క్రైస్తవులైతే ఈ సంఖ్యను సాతాను(దెయ్యం)గా అభివర్ణిస్తారు. అలాంటిది ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా మార్చారు. ఇపుడు ఆ కొత్త జిల్లాలు అభివృద్ధి 26 జిల్లాల సంఖ్య కారణంగానే  నోచుకోలేదని.. అంతేకాకుండా ప్రభుత్వం కోర్టుల్లో వేసిన కేసులను గెలువలేకపోతున్నదని, ఏ విషయంలోనూ గ్రహాలు అనుకూలించక అభివృద్ధి పనులకి ముందడుగు పడటం లేదని, ఆదాయం పెరగడం లేదని, శాస్వత అభివృద్ధి పనులు సైతం చేపట్టలేకపోతున్నదనేది ప్రస్తుతం జరుగుతున్న వాదన. వాదన అనేకంటే ప్రస్తుత రాష్ట్రం యొక్క ఆర్ధిక పరిస్థితి కూడా అలానే వున్నదని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్యను ఒక కొత్తజిల్లా అదనంగా చేర్చి 27 జిల్లాలు చేస్తే ఆ సంఖ్య న్యూమరాలజీ(సంఖ్యాశాస్త్రం) ప్రకారం ఇటు ప్రభుత్వానికి జిల్లాలకు కూడా మంచి జరుగుతుందని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు.  

27వ జిల్లా ఏర్పాటు సుగమం అయ్యిందా..?
ఏపీలో కొత్తజిల్లాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి 26 సంఖ్య న్యూమరాలజీ ప్రకారం డెవిల్ నెంబరు అనే ప్రచారాన్ని అటుంచితే..పరిపాలనా పరమైన చిక్కులను తెచ్చిపెడుతున్నది. 26 జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవర ఐటీడీఏ ప్రాంతాన్ని కూడా చేర్చారు. దీనితో జిల్లా కేంద్రం పాడేరుకి ఇక్కడి ప్రజలు వెళ్లాంటే ఒకరోజంతా ప్రయాణం సుమారు 485 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తప్ప వెళ్లలేరు. అదేవిధంగా అధికారుల పరిస్థితికూడా అంతే. ఈ ప్రాంతం నుంచి మండల, డివిజన్ అధికారులు పూర్తిస్థాయిలో జిల్లా కేంద్రానికి, జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతాలను అనుకున్న సమయంలో రాలేకపోతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దానిని దృష్టిలో ఉంచుకొని ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి తరువాత 27వ జిల్లాగా రంచపచోడవరం రెవిన్యూ డివిజన్ లోని 11 మండలాలు కలుపుతూ ఒక జిల్లాగా చేయాలని భావిస్తున్నట్టు ఒక ఉన్నతాధికారి ఈఎన్ఎస్ తో చెప్పుకొచ్చారు. 

అయితే అది కార్యరూపం దాల్చుతుందా..లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి వున్నదనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 26 అనే సంఖ్య మొత్తం కలిపితే 8 వస్తుందని..ఈ నెంబరు కీడు,చెడుకి సంకేతమనే విషయం ఇటు ప్రుభుత్వం దృష్టికి కూడా వచ్చిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రచారాలు, సంఖ్యాశాస్త్రం తదితర అంశాలను పక్కనపెడితే అల్లూరి జిల్లాలకు ఆ మూలన వున్న రంపచోడవరం ప్రాంతాన్ని జిల్లాగా విడదీయడం ద్వారా పరిపాలన సౌలభ్యం, ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని విషయం ప్రభుత్వం గుర్తించిందన్నారు. అయితే అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలపై పోరాటం చేసిన ప్రాంతాలన్నీ ఒకే జిల్లాల్లో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా తయారు చేసిందన్నారు.

ఇపుడు ప్రధానంగా రంపచోడవరం ప్రాంతాన్ని తప్పితే జిల్లాకి పెట్టిన పేరు విషయంలో భావం పోతుందన్నారు..కానీ ఇపుడు అన్ని అంశాల్లోనూ పరిపాలనా ఇబ్బందులు, అధికారులు, ప్రజల నుంచి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నదన్నారు. ప్రస్తుతం ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని కొత్తజిల్లా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని.. అల్లూరి జిల్లా భావం పోకుండా అల్లూరి పోరాటం చేసిన ప్రాంతాలను విభజించకుండా కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తారా అనే విషయం కూడా పరిశీలనలో ఉందన్నారు. న్యూమరాలజీ చెబుతున్నట్టుగా 26 సంఖ్యను 27 చేయడంతోపాటు ప్రజల ఇబ్బదులను తీర్చడానికి 27వ జిల్లా రాష్ట్రంలో ఏర్పాటవుతుందే సంకేతాలైతే వస్తున్నాయి. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది..!