ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో నూతన సంవత్సరంలో మొదటి షాక్ తగిలింది. జీఓ నెంబరు 1ను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల23 వరకూ సస్పెన్షన్ అమలులో వుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే రోడ్లపై నిర్వహించే బహిరంగ సభల్లో జనం మృత్యువాత పడుతుందని ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా జీఓనెంబరు-1ని తీసుకొచ్చింది. దీనిపై హైకోర్టుని ఆశ్రయించగా కోర్టు దానిని కొట్టేసింది. విపక్షాలన్నీ జీఓనెంబరు-1ని పెద్ద ఎత్తున తిరస్కరించాయి.