ఆంధ్రప్రదేశ్ లోని పాడైన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. పాడైన రోడ్లన్నింటినీ బాగుచేయాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రోడ్లపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లన్నింటినీ బాగు చేయాలని, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బాగుచేయాలని ఆదేశించారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ సూచించారు. నగరాలు, పట్టణాల్లో పౌరుడు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోగా రోడ్లను మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిప ఏపీసీఎంఎంస్ యాప్ ను సీఎం జగన్ ప్రారంభించారు.