ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐదు ప్రభుత్వశాఖలకు ఒకే ఒక్క ముఖ్యకార్యదర్శిగా చేసే అవకాశం సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలక్రిష్ణ ద్వివేదికి దక్కింది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆయనను వ్యవసాయశాఖకు బదిలీచేస్తూనే.. వాటితో పాటు సహకార, పశుసంవర్ధకం, డెయిరీ డెవలప్ మెంట్, మత్స్యశాఖ, మైనింగ్ శాఖలతోపాటు రైతు భరోసా కేంద్రాల ప్రత్యేక కమిషనర్ గా కొనసాగుతారని ఉటంకిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్ శాఖకు బుడితి రాజశేఖర్ ను ప్రభుత్వం నియమించింది.