ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచిదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ప్రత్యేక జీఓ కూడా హల్
చల్ చేస్తోంది. అయిదే దానిపై రాష్ట్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అది ఫేక్ జీవో అని, వయస్సు పెంచలేదని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ వైరల్ వార్తలను నమ్మవద్దని, తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని ఏపీ ఆర్దిక శాఖ అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వున్న 62 ఏళ్ల వయస్సు మాత్రం మరో ఏడాది 63కి పెంచే ప్రతిపాదన విషయంలో ఆలోచిస్తున్నట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు.