తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంట్ మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. దానిని పార్టీ ఎంపీలంతా భహిష్కరించాలని
తీర్మానించారు. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిన తరువాత కేసిఆర్ దూకుడు అంతా జాతీయ స్థాయిలోనే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.