అన్నవరం శ్రీ వీ వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, శ్రీ స్వామి వారి సన్నిధిలో సోమవారం భక్తుడు బంగారు చైన్ జారవిడుచుకున్నారని ఆలయ వర్గాలు మీడియా ద్వారా ప్రకటించాయి. సదరు ప్రదేశము నందు డ్యూటీలో వున్న సెక్యూరిటీ గార్డు తీసుకొని వచ్చి శ్రీస్వామి వారి కళావేదిక వద్ద ప్రకటన చేసినా సదరు వ్యక్తులు రాలేదని, మూడు రోజుల్లోగా సదరు చైను పోగొట్టుకున్నవ్యక్తి ఆధారాలతో వస్తువును తీసుకొని వెళ్లాలని ఆలయ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల తరువాత సెక్యూరిటీ సమక్షంలో ఆ వస్తువును స్వామివారి హుండీలో వేస్తామని ప్రకటించాయి. మరిన్ని వివరాలకు ఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నాయి.